విద్యార్థులు చదువుపై దృష్టిని కేంద్రీకరించాలి

64చూసినవారు
విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం, కొత్తూరు, నివగాం, పాతపట్నం తదితర మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సోమవారం సందర్శించారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాలలకే కాకుండా కాలేజీలకు సైతం పుస్తకాల పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్