కొండరాగోలులో పొలం పిలుస్తోంది రా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

76చూసినవారు
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. హిర మండలం కొండరాగోలు గ్రామంలో 'పొలం పిలుస్తుంది రా' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో ఆధునీకత, వ్యవసాయ పంటలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ అధికారులు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్