వీక్షిత్ ఆంధ్రా 2047 విజన్ లక్ష్యంగా పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పథక సంచాలకులు ఎం. కిరణ్ కుమార్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం పట్టణ మహిళా సామాజిక వనరుల కేంద్రంలో మెప్మా జిల్లా సిబ్బందికి, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులకు, పట్టణ సమాఖ్యల ఆర్పీలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్వాక్రా, తోపుడు బడ్లు జీవనోపాదులు పొందేలా చెయ్యాలన్నారు.