బొప్పాయిపురంలో ఉచిత పశు వైద్య శిబిరం

82చూసినవారు
బొప్పాయిపురంలో ఉచిత పశు వైద్య శిబిరం
టెక్కలి మండలం బొప్పాయిపురం గ్రామంలో మంగళవారం డా. కె జనక చక్రవర్తి ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 14 పశువులకు చికిత్స, 12 పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స, 4 పశువులకు కృత్రిమ గర్భధారణ, చిన్న, పెద్ద పశువులకు 28 నట్టల నివారణ మందులు వేశారు. పాల ఉత్పత్తికి పశుగ్రాసం సాగు, టీఎంఆర్ దాణా ప్రాముఖ్యతను పశువైద్య సిబ్బంది వివరించారు. ఈ కార్యక్రమంలో ఎహెచ్ఏలు భార్గవ్, కొండల రావు, రమణ, స్వాతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్