టెక్కలి జాతీయ రహదారిపై శనివారం విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న ఓ కారును లారీ ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఒక వ్యక్తితో పాటు ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉండగా అందరూ క్షేమంగా బయటపడ్డారు. కాగా కారును ఢీ కొన్న అనంతరం లారీ డ్రైవర్ పరారైనట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని టెక్కలి పోలీసులు పరిశీలించారు.