ఆముదాలవలస: ప్రభుత్వాలు మారిన తమ సమస్యలు పరిష్కారం కావడం లేదు

84చూసినవారు
ఆముదాలవలస: ప్రభుత్వాలు మారిన తమ సమస్యలు  పరిష్కారం కావడం లేదు
ప్రభుత్వాలు మారిన తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదని బూర్జ మండలానికి చెందిన 108 ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు నిరసనగా గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వాలు తమ గోడును పట్టించుకోవట్లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 108 సర్వీసెస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నవంబర్ 25న సమ్మెకు వెళుతున్నట్లు తెలిపారు. 108 సర్వీసులో నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్