హై ప్రియరిటి ఇరిగేషన్ పనులు చేపట్టేందుకు ఆముదాలవలస నియోజకవర్గానికి రూ. 39. 39 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ నుంచి ఈ నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. ఆముదాలవలస మండలంలో 5, సరుబుజ్జిలి మండలంలో 7 పనులను ఈ నిధులతో చేపడతామని అన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.