ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి మెట్టెక్కివలసలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సంకల్పం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఆమదాలవలస ఎస్సై కే వెంకటేష్ ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల దుర్వినియోగం వాటి పర్యవసానాలను వివరించామని అన్నారు. బాలికలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించామన్నారు.