ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అన్న క్యాంటీన్ ను ఆముదాలవలస బస్టాండ్ ఆవరణలో శుక్రవారం ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. అన్నార్థుల ఆకలి తీర్చడంలో అన్నా క్యాంటీన్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. అనంతరం ఆహార పదార్ధాల నాణ్యతను ఆయన పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు , బిజెపి ఇంఛార్జ్ సురపు నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.