శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వ్యవసాయ పంటల ఆధారంగా సాగులో వచ్చే సమస్యలపై వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు విస్తరణ సంచాలకులు శివ నారాయణ అన్నారు. ఆమదాలవలస పట్టణంలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని శనివారం సందర్శించారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలన చేసి, విస్తరణ కార్యక్రమాల అమలులో చేపట్టాల్సిన చర్యలను శాస్త్రవేత్తలకు సూచించారు.