బూర్జ మండల పోలీసు స్టేషన్ ను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక శనివారం సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను వివిధ రికార్డులను పరిశీలించారని స్థానిక పోలీసులు తెలిపారు. గంజాయి ఇతర నిషేధిత మత్తు పదార్థాల రవాణాను నిషేధించాలని పోలీసు స్టేషన్లో వచ్చిన వివిధ కంప్లైంట్ లను సత్వరమే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానము అవలంభించాలని ఆమె అన్నారు. ఆమెతో పాటు సిఐ, ఎస్ఐ ఉన్నారు.