ఎల్. ఎన్. పేట: రైస్ మిల్లులో చోరీ.. క్లూస్ టీం పరిశీలన
ఎల్. ఎన్. పేట మండలం ధనుకువాడ గ్రామానికి వెళ్లే రోడ్డులోని శ్రీ కల్కి కామేశ్వరి రైస్ మిల్లులో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. మిల్లు ఆఫీసు రూమ్లో ఉన్న కంప్యూటర్ పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు, అని మిల్లు యజమాని వూణ్న సురేశ్ తెలిపారు. గత నెల 19వ తేదీ రాత్రి కూడా ఇదే మిల్లులో దొంగతనం జరిగింది. ఇది రెండోసారి. గురువారం సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్లూస్ టీం విచారణ ప్రారంభించింది.