రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ పరిధిలో కంబాలపేటలో స్వయంభుగా వెలసిన శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మూడో సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం ఆలయ ఆవరణలో భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వాములు, భవానీలు, శివస్వాములు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.