పుష్ప-2 మ్యానియా మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా కాసేపల్లో మూవీ ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండడంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. మూవీ రిలీజ్ సందర్భంగా HYD ఉప్పల్‌లో అభిమానులు బాణాసంచా పేల్చి బైక్ ర్యాలీ నిర్వహించారు. రిలీజ్ కాకముందే పలు రికార్డులను బద్దలు కొట్టడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.