పుష్ప 2 మరి కాసేపట్లో విడుదల కానుంది. అల్లు అర్జున్‌తో పాటు అల్లు ఫ్యామిలీకి చెందిన వారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్లో ఈరోజు రాత్రి 9.30 గంటలకు సినిమా చూడబోతున్నారు. దర్శకుడు రాజమౌళి నల్లగండ్లలోని అపర్ణలో, మైత్రీ మేకర్స్ నిర్మాతలు ఏషియన్ మహేశ్ బాబు థియేటర్‌లో, దిల్ రాజు, అనిల్ రావిపూడి తదితరులు శ్రీరాములు థియేటర్‌లో, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ AAA సినిమాస్‌లో చూడనున్నట్లు తెలుస్తోంది.