CAPF, అస్సాం రైఫిల్స్ లో 1,00,204 ఉద్యోగ ఖాళీలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. CRPF-33,730, CISF-31,782, BSF-12,808, ITBP-9,861, SSB-8,646, అస్సాం రైఫిల్స్ లో 3,377 చొప్పున ఖాళీలున్నట్లు తెలిపారు. UPSC, SSC ద్వారా త్వరగా భర్తీ చేస్తామన్నారు. వైద్యపరీక్షల సమయం తగ్గించి, కానిస్టేబుల్ GD కోసం షార్ట్ లిస్టైన వారి కటాఫ్ మార్కులు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు.