శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం నేరుగా తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం, ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగించేందుకు నిత్యం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.