రణస్థలం మండలంలో 11 కేవీపీ పీడర్ గ్రామాల విద్యుత్తు నిర్వహణ పనుల నిమిత్తం ఈనెల 28వ తేదీన అనగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ భయన్నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి వారికి సహకరించాలని కోరారు.