ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్య పేటలోని దేవి ఆశ్రమంలో ఘనంగా చక్ర మేరువులకు సామూహిక కుంకుమ అర్చనలు నిర్వహించారు. సోమవారం ధనుర్మాసం చివరి రోజున పౌర్ణమి రావడంతో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆశ్రమ పీఠాధిపతి బాల భాస్కర శర్మ తెలిపారు. ఈ క్రమంలో దంపతులు ముత్తైదువులు సామూహికంగా పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం ప్రసాదం వితరణ చేపట్టామని వివరించారు.