విధులు నిర్వహిస్తున్న విద్యుత్ లైన్ మెన్ కు పాము కాటు

83చూసినవారు
విధులు నిర్వహిస్తున్న విద్యుత్ లైన్ మెన్ కు పాము కాటు
జి. సిగడాంలో విద్యుత్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న టి. గాంధీరామ్ పాము కాటుకు గురయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎస్సీ కాలనీ సమీపంలో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. శుక్రవారం వాటిని సరి చేస్తున్న సమయంలో పాముకాటుకు గురై స్పృహ కోల్పోయారు. గ్రామస్థులకు ఈ విషయం తెలియగా అక్కడికి చేరుకొని హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు.

సంబంధిత పోస్ట్