శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక గ్రామంలో గురువారం నలుగురు రైతులతో వరి పొలాలలో అజోల్లా ఒక ఎకరానికి ఐదు కేజీలు చొప్పున వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాట్లాడుతూ, ఈ అజోల్ల వేసుకోవడం వలన పంటకి కావాల్సిన నత్రజని అందుబాటులో ఉంటుందని అలాగే కలుపు నివారణ జరుగుతుందని సిబ్బంది రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, జగదీష్, రాంబాబు పాల్గొనడం జరిగింది.