ఒకప్పుడు వక్కను కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా సాగు చేసేవారు. అయితే ఇటీవల ఏపీలోనూ పలు జిల్లాల రైతులు వక్క సాగుపై దృష్టి పెడుతున్నారు. చెట్లు నాటిన ఐదేళ్ల తర్వాత కాపుకు రావడం, ఒక్కసారి సాగు చేస్తే 45 ఏళ్ల వరకు ఆదాయం వస్తుండడంతో కర్ణాటక నుంచి మొక్కలను దిగుమతి చేసుకొని సాగుకు మొగ్గుచూపుతున్నారు. చీడపీడల వ్యాప్తి కూడా తక్కువ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వక్క క్వింటాలు ధర రూ.50వేల వరకు పలుకుతోంది.