సోంపేటకు చెందిన శతాధిక వృద్ధురాలు ఇప్పలి శాంతమ్మ (110) శుక్రవారం మృతి చెందింది. ఈమె స్వస్థలం సోంపేట మండలం కొత్తూరు. శతాధిక వృద్ధురాలు ఐదు తరాలను చూసిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అంత్యక్రియల్లో కుటుంబీకులు పాల్గొన్నారు.