కంచిలి: చట్ పూజా.. చెరువులో ప్రత్యేక పూజలు

54చూసినవారు
కంచిలి: చట్ పూజా.. చెరువులో ప్రత్యేక పూజలు
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఠం కంచిలి జగన్నాథ స్వామి ఆలయ సమీపంలోని చెరువులో శుక్రవారం చట్ పూజా కార్యక్రమాన్ని కడురమ్యంగా నిర్వహించారు. ఉదయాన్నే చెరువు వద్దకు భక్తులు చేరుకుని నీటిలో చెరుకు గెడలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూపదీపాలు సమర్పించి సూర్యనమస్కారాలు చేశారు. చట్ పూజను ఉత్తర భారతదేశంలోని బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో గొప్ప పండుగగా జరుపుకుంటారని భక్తులు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్