ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉన్న బెంతు ఒరియా కులస్థులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష గురువారం నాటికి 331వ రోజుకు చేరుకుంది. ఈమేరకు దీక్షలో పాల్గొన్న బొరివంక గ్రామస్థులు మాట్లాడుతూ మా కుల ధ్రువీకరణ పత్రాల సమస్య కోసం 2019 సంవత్సరంలో ప్రభుత్వం వన్ మెన్ కమిషన్ వేసిందని, అయితే ఆ కమిషన్ వెలువరించిన నివేదికను ఇప్పటివరకు ప్రభుత్వాలు బహిర్గతం చేయలేదని, దానిని వెంటనే తెలియజేయాలని డిమాండ్ చేశారు.