సోంపేట మండలం బారువ రైల్వే స్టేషన్లో శనివారం ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి హై-వోల్టేజీ విద్యుత్ తీగను పట్టుకోవడంతో షాక్ కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. సహాయం చేసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నప్పటికీ, మతిస్థిమితం లేని కారణంగా బాధితుడు స్థానికులపై దాడి చేయడంతో భయాందోళన చెందారు. అనంతరం రైల్వే సిబ్బంది 108 అంబులెన్స్ కు సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.