విద్యార్థులే దేశ సంపదని, క్రమశిక్షణతో చదువుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించుకోవాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. కవిటి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంగళవారం ఉచితంగా పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధతో ఉందని అన్నారు.