Jan 19, 2025, 23:01 IST/వేములవాడ
వేములవాడ
నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
Jan 19, 2025, 23:01 IST
గత 10 ఏండ్లుగా ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నూతన రేషన్ కార్డులు జారీ చెయ్యలేదని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 21నుండి 24 వరకు ఆయా గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జనవరి 26 నాడు నూతన రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. డాక్టర్ బియర్ అంబేద్కర్ రాజ్యాంగం 75ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్డ్స్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.