తమిళ సరిగమప షోలో హీరోయిన్ కాయాదు లోహర్‌కు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఓ పిల్లాడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమె పెదాలపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆమె తల తిప్పుకుంటున్నా ముందుకెళ్లాడు. దీనిపై నెటిజన్లు ఫైరవుతున్నారు. ఇలాంటి ప్రవర్తనను పేరెంట్స్ ఆదిలోనే కంట్రోల్ చేయాలని, లేదంటే భవిష్యత్తులో బాలుడికి ఇబ్బందులు తప్పవంటున్నారు. TRP కోసం అశ్లీలతను ఎంకరేజ్ చేయకుండా షో నిర్వాహకులూ కఠినంగా ఉండాలని సూచిస్తున్నారు.