కర్ణాటకలోని బెళగావిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో పోలీసులు యువకుడిని, అతడి తల్లిని అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, వాచ్ మెన్ గా పనిచేసే ఓ మహిళ నిందితుడి కుటుంబం నుంచి రూ.50,000 అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆమె కూతుర్ని పెళ్లి చేసుకుంటానని సదరు యువకుడు ఒత్తిడి చేసి శారీరకంగా వాడుకోవాలని చూశాడని పోలీసులకు బాధితురాలు ఆరోపించింది.