ఖోఖో పురుషులు, మహిళల జట్లకు ప్రధాని మోదీ అభినందనలు

63చూసినవారు
ఖోఖో పురుషులు, మహిళల జట్లకు ప్రధాని మోదీ అభినందనలు
ఢిల్లీ వేదికగా ఆదివారం ఖోఖో వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళా జట్టు, పురుషుల జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వారి అసమాన నైపుణ్యం, సమిష్టి కృషి, దృఢ సంకల్పం కారణంగా కప్ వచ్చిందని ట్వీట్ చేశారు. ఈ విజయం ఖోఖోకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెస్తుందన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందన్నారు. రానున్న కాలంలో మరింత మంది ఖోఖో క్రీడపై ఆసక్తి పెంచుకోవడానికి మార్గం సుగమం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్