ఖోఖో తొలి ప్రపంచకప్‌లోనే భారత్ చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచుల్లో భారత మహిళలతో పాటు పురుషుల జట్టు కూడా ఘన విజయం అందుకుంది. దీంతో ఇరు జట్లూ విశ్వ విజేతలుగా నిలిచాయి. తొలుత ముగిసిన అమ్మాయిల మ్యాచ్‌లో నేపాల్ ఉమెన్స్ టీమ్‌పై భారత్ 78-40 తేడాతో గెలిచి తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. కాసేపటి క్రితం ముగిసిన పురుషుల ఫైనల్స్‌లో నేపాల్‌పై 54-36 తేడాతో భారత్ విజయం సాధించింది.