తనకు పరిచయమైన వ్యక్తి (57)ని ‘అంకుల్ టీ తాగుదాం.. మా ఇంటికి రండి’ అని పిలిచి, హనీట్రాప్ వలలో ఇరికించి పరారీలో ఉన్న యువతి (21)ని కర్ణాటకలోని బ్యాడరహళ్లి ఠాణా పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 9న యువతి తన ఇంటికి సివిల్ పనులు చేసే గుత్తేదారును పిలిపించుకుంది. ఆమె ఉన్నప్పుడు కొందరు యువకులు వచ్చి ఇద్దరినీ బెదిరించి డబ్బులు లాగేసుకున్నారు. యువతే కుట్రను పన్నిందని గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.