వరి పంటలు అధిక దిగుబడులు సాధించాలంటే తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలనీ నియోజకవర్గ వ్యవసాయ సంచాలకులు రవీంద్రభారతి, మండలఅధికారి సునీత అన్నారు. శుక్రవారము రాహుల్ వలస గ్రామం లో పొలంబడి నిర్వహించి విత్తన శుద్ధిపై రైతులకు అవగాహన కల్పించారు. పొలాల్లో జీలుగు, కట్టే జనుమ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు సాగుకు ఇది మంచి సమయం అని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.