శ్రీముఖలింగం, చల్లవానిపేట, లింగాలవలస, తిలారు రైల్వే స్టేషన్ లలో బుధవారం గంజాయి మాదకద్రవ్యాల అక్రమరవాణా పై పోలీసులు తనిఖీలు చేపట్టారు. జాగిలాల సహాయంతో దుకనాలలో పరిసర ప్రాంతాలలోనూ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నరసన్నపేట ఇన్స్ పెక్టర్ తెలియజేశారు.