లేటు అయితే గేటు బయటే..!

1909చూసినవారు
లేటు అయితే గేటు బయటే..!
మందసా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులు సమయానికి రాలేదని స్కూలు గేటు బయట మండుటెండలో గంట పాటు నిలబడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 04-04-2022 సోమవారం నుంచి సర్కారు బడులకు ఉ 7-30 నుండి 11-30 వరకు (ఒంటిపూట) గా నిర్ణయించడం విధితమే. అయితే గురువారం ఈ పాఠశాలకు వివిధ కారణాల వలన 10 ని.. లేటు అయినందుకు తమని గేటు బయట ఎండలో నిలబెట్టారని విద్యార్థులు వాపోతున్నారు. ఇటువంటి చర్యలవలన విద్యార్థులలో బడికి పోవాలన్న ఆతృత లోపిస్తుందని విద్యానిపుణుల సూచన. కావున ఇప్పటికైనా స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్