పలాస: ఆటో బోల్తా పడిన ఘటనలో పదిమంది కూలీలకు గాయాలు
పలాస మండలం కంబ్రిగాం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 10మంది మహిళా కూలీలు కాశీబుగ్గ కు ఆటోలో వెళుతుండగా. ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది మహిళా కూలీలతో పాటు ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హైవే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.