పలాస మున్సిపాలిటీలో త్రాగు నీటి సమస్య పరిష్కారానికి అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ జలజీవన్ మిషన్ అదికారులతో సమిక్ష నిర్వహించారు. సమస్యపై ఇదివరకే పంచాయితీ రాజ్ కమిషనర్ ను కలవడం జరిగిందన్నారు. మంచినీటి పరిష్కారంకు జలజీవన్ మిషన్ నుంచి 8 టీఎంసీ నీటిని అందించాలని అధికారులను ఆమె ఆదేశించారు.