పాతపట్నంలో ఘనంగా దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు

55చూసినవారు
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దసరా ఉత్సవాలను అక్టోబర్ 3 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు జరుగుతున్న సందర్భంగా శ్రీ నీలమణి అమ్మవారి ఆలయంలో స్థానిక టీడీపీ నాయకులు, దేవాలయ అధికారులు సమక్షంలో కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. అమ్మవారి దయతో ఈ ఏడాది దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్