జోడూరులో ఉపాధి పనుల పరిశీలన

54చూసినవారు
జోడూరులో ఉపాధి పనుల పరిశీలన
ఉదయం వేగంగా పనులు మొదలుపెట్టి వేగంగా పూర్తి చేసే విధంగా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలని మెలియాపుట్టి ఏపీఓ రవి అన్నారు. ఆయన సోమవారం జోడూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. వేసవి జాగ్రత్తలు పాటించి, పనిచేయాలని సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటించడం ఎంత ముఖ్యమో కొలతల ప్రకారం పనిచేయడం కూడా అంతే ముఖ్యమని వేతనదారులకు అవగాహన కల్పించారు. అతనితోపాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్