హామీల అమలు చేతగాక అసత్య ఆరోపణలతో కూటమి ప్రభుత్వం ప్రజలను ప్రక్క త్రోవ పట్టించేందుకే ప్రయత్నిస్తుందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గురువారం ఆరోపించారు. తిరుమల లడ్డూ పై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందని అన్నారు. వాస్తవాలను అసత్యలుగా మార్చడంలో చంద్రబాబు సిద్ధ హస్తులన్నారు. లడ్డూ పేరుతో కుటిల రాజకీయలు ఆపాలని కూటమి రాజకీయలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.