కొత్తూరు: బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలంటూ విఓఏల నిరసన

50చూసినవారు
కొత్తూరు: బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలంటూ విఓఏల నిరసన
కొత్తూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం ఏపీ వెలుగు విఓఏల సంఘం ఉద్యోగులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ మద్దతు తెలిపారు. వెలుగులో పనిచేస్తున్న వీఓఏ ఉద్యోగులకు ఏడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బకాయి వేతనాలు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్