చికిత్స పొందుతూ వివాహిత మృతి

85చూసినవారు
చికిత్స పొందుతూ వివాహిత మృతి
పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందారు. కొత్తూరు మండలం పారాపురం గ్రామానికి చెందిన వివాహిత సుబిద్ధి బాలామణి పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం బాలేరు తపాలా కార్యాలయంలో బీపీఎంగా పని చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 18న పురుగుల మందు తాగగా శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసారు.

సంబంధిత పోస్ట్