పాఠశాల పైకప్పు కూలి బాలుడు మృతి
పాఠశాల పైకప్పు కూలి అదే పాఠశాలలో చదువుతున్న ఒక బాలుడు మృతి చెందిన ఘటన రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో బి. కృష్ణంరాజు(15)తోటి వారితో బంతి ఆట ఆడుతున్నాడు. సదరు బంతి కోసం నిర్మాణంలో ఉన్న పాఠశాల క్రిందకు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా పాఠశాల పై కప్పు కూలడంతో, కృష్ణంరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 9వ తరగతి చదువుతున్న మరో బాలుడికి గాయాలయ్యాయి.