ప్రభాస్ నటించిన కల్కి సినిమాతో ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించిన బుజ్జి వాహనం సోమవారం సిక్కోలులో రానుంది. జిల్లాలోని రణస్థలం మండలం నందికుడితిపాలెం రామతీర్థం రోడ్డులోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో వాహనాన్ని ప్రదర్శించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మీ స్నేహితులతో బుజ్జీని చూడటానికి బయటకు వెళ్లండి.