Oct 18, 2024, 14:10 IST/
TG: 'సార్ దండం పెడుతున్నాం.. మమ్మల్ని కొట్టకండి'
Oct 18, 2024, 14:10 IST
HYDలోని అశోక్ నగర్ లో నిరసన తెలుపుతున్న గ్రూప్ -1 అభ్యర్థులు తమ ఆవేదనను మీడియా ముందు చెప్పుకున్నారు. 'సార్ ఎస్పీ గారు దండం పెడుతున్నాం.. మమ్మల్ని కొట్టకండి. మేము ధర్నాకు, బంద్‌లు చేయడం లేదు. శాంతియుతంగా మా సమస్యను ప్రభుత్వానికి చెప్తున్నాం. దీనికి మమ్మల్ని ఉరికించి కొడుతున్నారు. కొందరు మా మిత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జీవో. 29ని రద్దు చేసి పరీక్షలు రీషెడ్యూల్ చేయండి' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.