ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. షహదారా సమీపంలోని విశ్వాస్ నగర్ సమీపంలో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సంజయ్ జైన్ అనే కార్మికుడిపై గుర్తు తెలియని దుండగులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజయ్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.