కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను నిన్న విడుదల చేసిన విషయం తెలిసందే. అయితే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం కవితలా ఉందని కాంగ్రెస్ విమర్శించింది. ఇప్పుడు కాంగ్రెస్ పెట్టే విగ్రహం సోనియాదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించాల్సిన తెలంగాణ తల్లిని రేపు మరోపార్టీ అధికారంలోకి వస్తే మార్చదన్న గ్యారంటీ ఏంటని, ఒకే ఊర్లో 2 విగ్రహాలుంటే పాత విగ్రహాలను కూల్చివేస్తారా? నిజమైన తల్లి ఎవరని భవిష్యత్తు తరాలు అడిగితే ఏమని జవాబిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.