TG: జగిత్యాల జిల్లాలో కల్తీపాలు కలకలం రేపాయి. పాలను కల్తీ చేసేవారికి కఠిన శిక్షలు అమలు చేయాలని కోర్టులు ఆదేశించినా.. కల్తీ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాలలో సోడా కలుపుతున్నారు. ఈ విషయాన్ని అతని దగ్గర పాలు విక్రయించేవారు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు.