TG: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై 108 వాహనంతో ఓ దొంగ హల్చల్ చేశాడు. హయత్ నగర్‌లో 108 వాహనాన్ని ఓ దొంగ ఇవాళ చోరి చేశాడు. ఖమ్మం వైపు అంబులెన్స్‌తో వెళ్తున్న అతడిని చిట్యాల వద్ద ఆపేందుకు ఎస్ఐ జాన్ రెడ్డి ప్రయత్నించారు. కొర్లపహాడ్ టోల్ ప్లాజాను ఢీకొట్టి దొంగ వాహనంతో పారిపోయాడు. కేతేపల్లి ఎస్ఐ శివతేజ రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టడంతో దొంగ వాహనాన్ని రోడ్డు పక్కన తుప్పల్లోకి పోనిచ్చాడు. చివరకు దొంగను పోలీసులు పట్టుకున్నారు.